![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -632 లో.... రుద్రాణి మాయలో పడిపోయి ధాన్యలక్ష్మి దుగ్గిరాల ఇంట్లో ఆస్తుల పంచాయతి మొదలు పెట్టింది.. అందుకు భర్తని కూడా ఒప్పించింది కోర్ట్ నుండీ నోటిసులు రావడం లాయర్ ఇంటికి రావడం నడుస్తుంది. ఇక అదంతా చూసిన కావ్య.. వాళ్ళు కేసు వేస్తే ఎలా తీసుకుంటారు. అసలైన వారసుడు వెయ్యాలి కదా అని లాజిక్ గా మాట్లాడుతుంది. కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి నేను కేసు వెయ్యనంటూ ధాన్యలక్ష్మికి దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. నాకు బంధాలు కావాలి. ఈ కుటుంబం కావాలంటూ ముక్కుసూటిగా మాట్లాడతాడు. అది విన్న ఇందిరాదేవి.. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు ఒక మూడు నెలల టైమ్ కావాలి. అంత మీకే తెలుస్తుందంటు కావ్య చెప్పగానే ధాన్యలక్ష్మి చిరాకుగా వెళ్ళిపోతుంది.
ఇక కొడుకు తనని ఎదిరించాడని ధాన్యలక్ష్మి కోపంగా గదిలో ఉన్న వస్తువులు విసిరేస్తుంది. రుద్రాణి వచ్చి ఇంకా రెచ్చగొడుతుంది. ఇప్పుడు మనం చెయ్యాలిసింది ఇది కాదు.. మూడు నెలల వరకు ఎందుకు? రోజు ఆస్తులు పంచమని గొడవ చేద్దామని రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోయాక రాహుల్ వస్తాడు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ ధాన్యలక్ష్మికి తెలియదు. ఫుల్ గ్రిప్ లో ఉంచాలని రాహుల్ తో అంటుంది రుద్రాణి. అసలు రాజ్, కావ్య మూడు నెలలు ఎందుకు టైమ్ అడిగారు తెలుసుకోమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది. వాళ్లపైనే నా పోకస్ ఉంటుందని రాహుల్ అంటాడు. రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు. కళ్యాణ్ ని రప్పించే ముందు నాకు చెప్పాలి కదా అంటాడు రాజ్. ఒకవేళ కళ్యాణ్ రాకపోతే ఇంకా టెన్షన్ పడేవాళ్ళమని కావ్య చెప్తుంది. ఆ తర్వాత డిజైన్స్ గురించి మాట్లాడుకుంటారు.
అపర్ణ ఆలోచిస్తుంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్.. ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా అని సుభాష్ అంటాడు. ఎక్కడ సాల్వ్ అయింది అసలు ప్రాబ్లమ్ ఏంటో చెప్పలేదు కదా అని అపర్ణ అంటుంది. కావ్య నే కళ్యాణ్ ని రప్పించి ఉంటుందని సుభాష్ అంటాడు. మరోవైపు రాజ్ కి కావ్య డిజైన్స్ చూపించగా.. చాలా బాగున్నాయని రాజ్ చెప్తాడు. అవునా నేనే వేసానని కావ్య అనగానే.. బాలేవని రాజ్ అంటాడు. మీరు వేస్తే బాగున్నాయి.. నేను వేస్తే బాగోలేవా అని కావ్య అంటుంది. బాగున్నాయ్ ఎలా చేసావని రాజ్ అడుగుతాడు. అవి స్పెషల్ డిజైన్స్ అంటూ కావ్య వాటి గురించి చెప్తుంది ఈ డిజైన్స్ గురించి కస్టమర్ ఒపీనియన్ కనుక్కుంటానని రాజ్ అనగానే.. ఎలా అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |